Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

చిత్రం న్యూస్, బాపట్ల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని 29,28,26 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ  సంవత్సరకాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన సూపర్ సిక్స్ పథకాల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని  ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని దాని నుంచి బయట పడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూడా తల్లికి వందనం అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, అన్న క్యాంటీన్ ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకొని అహర్నిశలు కష్టపడి కూటమి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని,నిరుపేద లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి లక్ష్యమని ఉద్ఘాటించారు. పి4 విధానాన్ని రాష్ట్రలో ప్రవేశ పెట్టి పేదలను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చూస్తూ రాష్ట్ర రాజధాని,పోలవరం ప్రాజెక్ట్ కు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో  ఎన్డీయే సర్కారు పనిచేస్తోందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు  తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ ఛార్జ్ మందపాటి ఆంద్రెయ, యూనిట్ ఇన్చా ఛార్జ్ సోమయ్య, పట్టణ వైస్ ప్రెసిడెంట్ బూర్లె రామ సుబ్బారావు, 29వ వార్డు ప్రెసిడెంట్ పులి శ్రీనివాసరావు,28వ వార్డు ప్రెసిడెంట్ కొట్రా జానకిరామయ్య,27వ వార్డు ప్రెసిడెంట్ చాపా ప్రశాంత్ , క్లస్టర్ యూనిట్ , బూత్ ఇన్ఛార్జ్ లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments