Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఘనంగా  ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన

ఘనంగా  ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, జమ్మికుంట:మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య ఆధ్వర్యంలో కోరపెల్లి వెంకటేశ్వర్ల పల్లి గ్రామాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 ఆవిర్భావం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, వేల గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ  తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రామంచ భరత్ హాజరయ్యారు. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కొబ్బరికాయలు కొట్టి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య మాట్లాడుతూ.. మాదిగ జాతికి జరుగుతున్న విద్య, ఉద్యోగ ,రాజకీయ రిజర్వేషన్ల అన్యాయాలపై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 31 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ప్రకాశం జిల్లా ఈదుమూడి నుండి ప్రారంభమైన ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిందని కృష్ణ మాదిగ మాదిగ జాతికే కాకుండా అట్టడుగు వర్గాల ప్రజలే కాకుండా అగ్రవర్ణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తను ముందుండి పోరాడి వారి హక్కులను సాధిస్తారని గత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిన్న పిల్లలకు గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం తోపాటు వితంతువులకు వికలాంగులకు పెన్షన్స్ పెంచే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెన్షన్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్న వెనకాడకుండా సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి సుప్రీంకోర్టు నుండి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలను ఒప్పించి షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేయడం యావత్తు భారతదేశ ప్రజలకే గర్వకారణం అన్నారు.   ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కోరపల్లి గిరవేన ఓదెలు,  వెంకటేశ్వర్ల పల్లి ఉపసర్పంచ్ పోల్సాని శ్రీనివాసరావు, వార్డ్ మెంబర్ బండారి రాజకుమార్ ,బుడగ జంగం జిల్లా నాయకులు రేపెల్లి వెంకటేష్, నేతకాని సంఘం నాయకులు కొండు బిక్షపతి, హమాలీ సంఘం నాయకులు బండారి శ్రీధర్ , బీజేపీ నాయకులు రెంటాల మహేందర్, నాయి బ్రాహ్మణ సంఘం కొత్తగట్టు సంపత్ , మైనాటి నాయకుడు ఎండీ రహీం, యాదవ సంఘం అధ్యక్షులు గిరవైన సతీష్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని అంకుస్ మాట్ల సంజీవ్ కుమార్, నాగిళ్ల ఓంకార్, గాజుల అర్జున్ పుల్లూరి రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments