తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి గా పిల్లి నరేష్
చిత్రం న్యూస్, ఇచ్చోడ:తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన పిల్లి నరేష్ ను ఎన్నుకున్నారు. ఈ మేరకు వరంగల్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి నరేష్ మాట్లాడుతూ. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. మేదరి సంఘం సమస్యల పరిష్కారానికి, న్యాయమైన హక్కుల సాధనకు కృషి చేస్తూ సంఘం బలోపేతానికి పనిచేస్తానన్నారు. తనను తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం ప్రతి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.