చంద్రమాంపల్లి లో సుపరిపాలన లో ‘తొలి అడుగు’ కార్యక్రమం
చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.