గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న డా.కళ్లెం వెంకట్ రెడ్డి
డా.కళ్లెం వెంకట్ రెడ్డికి మెడికల్ ఎక్సలెన్స్ 2005 అవార్డు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డా. కళ్లెం వెంకట్ రెడ్డి జిల్లాలో అందిస్తున్న సేవలకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఎక్సలెన్స్ 2005 అవార్డు వరించింది. రాజ్ భవన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టే ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా అందజేస్తారని ఆయన తెలిపారు. అవార్డు అందుకున్న డా.కళ్లెం వెంకట్ రెడ్డిని పలువురు అభినందించారు .