విద్యార్థులకు, బ్యాగులను పంపిణీ చేస్తున్న దృశ్యం
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని కామగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన నిమ్మల సుధాకర్ రెడ్డి, నక్కల సంతోష్ రెడ్డి విద్యార్థులకు విరాళంగా అందజేసిన బ్యాగ్స్, పెన్నులను డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బిక్కుసింగ్, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, గ్రామస్తులు మహేందర్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.