ఎంపీపీస్ శాలపల్లికి ప్యూరిఫైడ్ విరాళం
*మ్యాదర శ్రీనివాస్ ఉదారత
చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని ఎంపీపీస్ శాలపల్లికి దాదాపు రూ.15 వేలు విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైడ్ ను మ్యాదర శ్రీనివాస్ విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. పాఠశాల నుండి నేను చాలా నేర్చుకున్నాను. కొంత రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులతో వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ ను రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.శారద మాట్లాడుతూ..ఇక నుంచి విద్యార్థులు నీళ్ల బాటిల్స్ మోయాల్సిన అవసరం లేదని, వారికి శుద్ధమైన నీరు ఇప్పుడు పాఠశాలలోనే అందజేస్తామని పిల్లలకు కాస్త బరువు భారం తగ్గించినందుకు మ్యాదర.శ్రీనివాస్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు చిన్నక్క మల్లారెడ్డి, జడల అశోక్, తాజా మాజీ ఉపసర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి ,హైమావతి, కృష్ణ, పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్, తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుడు ఎం. సతీష్ , పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్ పాల్గొన్నారు.