ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు
*అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు నోటుబుక్ లు పంపిణీ చేసే కార్యక్రమం పొనాలలో ప్రారంభం
చిత్రం న్యూస్, బేల : రాష్ట్ర మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 500మంది విద్యార్థులకు శుక్రవారం ఆడనేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నోట్ బుక్ లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని పొనాల గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలో రక్త దానం చేశారు .ఈ సందర్భంగా జోగు రామన్న గారి బర్త్డేను కేక్ కట్ చేసి ఘనంగా స్కూల్ పిల్లలతో జరుపుకున్నారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ.. జోగు రామన్న ప్రజల మనిషి అని ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజా నాయకుడు అని పేర్కొన్నారు. జోగు రామన్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ ,బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న ఒళ్లప్వర్ ,తేజ రావు మస్కే , మధుకర్ జక్కల్వార్,తనుబ ఠాక్రే, సుదర్శన్ భతుల ,విపిన్ ఖోడే ,శత్రుగన్ ,గ్రామస్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.