Chitram news
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 11:07 am Editor : Chitram news

ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన

 ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన 

చిత్రం న్యూస్, చిగురుమామిడి  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం రోజు ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిభిరానికి విశేష స్పందన వచ్చింది.200 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్లాం ఆపరేషన్ అవసరమైన 19 మందిని ఏలాంటి రవాణా ఖర్చు లేకుండా ప్రత్యేక వాహనంలో హైద్రాబాద్ లోని ఆసుపత్రి తరలించామని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశలను వినియోగించూసుకోవాలని కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరములో బుర్ర శ్రీనివాస్ గౌడ్, జక్కుల బాబు, ముంజ ప్రకాష్ గౌడ్, బండి ఆదిరెడ్డి, జక్కుల స్వామి, పచ్చిమట్ల అజయ్ కుమార్ గౌడ్, రాజు గౌడ్. ముత్యాల మహేందర్. కక్కర్ల సంపత్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.