సీపీఐ మండల కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య
*ఇచ్చోడలో సీపీఐ నాల్గవ మహాసభలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో సీపీఐ నాల్గవ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇచ్చోడలో సమస్యలు తిష్ట వేశాయని వెంటనే పాలకులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సీపీఐ మండల నూతన కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య, మండల సహాయ కార్యదర్శిగా దుబ్బాక అశోక్ లను ఎన్నుకున్నారు. మెడపట్ల రాజేందర్, బోదాసు రవి, అన్నెల చిన్న లక్ష్మన్న, విలాస్, దుబ్బాక అశోక్ లను సీపీఐ కార్యవర్గ సభ్యులుగా,చౌహాన్ సంజు, యోగేష్ బుజ్జి, రాజ్ కుమార్, ముదుగు శివకుమార్, మెడపట్ల వెంకటేష్, గస్కంటి మహేష్, ఎం ప్రసాద్, ఏ రాజ్ కుమార్, దుబ్బాక లక్ష్మణ్, రాజేశ్వర్ లను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.
-Advertisement-