Chitram news
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 9:08 am Editor : Chitram news

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలో సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా ఏడిఏ శ్రీధర్ అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపులు, గోదాములను శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి తో కలిసి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

వర్షాలు  కురవడంతో మండలంలో రైతాంగం యొక్క పంటలు ప్రస్తుతం బాగున్నాయాని పేర్కొన్నారు.మండలానికి 100 టన్నుల యూరియా హకా సెంటర్ కు పంపిణి చేశామన్నారు. త్వరలో సహకార సంఘాలకు కూడా యూరియా పంపిణి చేస్తామన్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఆయన వెంట ఏవో సాయి తేజ రెడ్డి, ఏఈవో ఉమర్ ఉన్నారు.