పెద్దాపురంలో ర్యాలీనీ ప్రారంభిస్తున్న రాజా సూరి బాబు రాజు
చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ బైక్ మెకానిక్ దినోత్సవ వేడుకలు పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బైక్ మెకానిక్ లు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వగృహం వద్దకు అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రాజా సూరిబాబురాజు జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బైక్ మెకానిక్ లు సంఘటికంగా ఉంటూ హక్కుల కోసం సమిష్టిగా కదలాలన్నారు.ఈ సందర్బంగా యూనియన్ తరుపున సీనియర్ మెకానిక్ లైన సింగారపు అప్పారావు, కోరాడ సూర్యనారాయణ, నందూరి నీలబాబులను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నమ్మి నాగరాజు, రంగారావు, శంకర్, యర్రా శ్రీను, జంపా శ్రీను, కాకి రాజు, మల్లేశ్వరరావు, మణికంఠ, శివ, సింగారపు శ్రీనివాసరావు, వాసు, శివ, సుబ్బారావుతో పాటు పెద్ద సంఖ్యలో మోటార్ మెకానిక్ వర్కర్స్ పాల్గొన్నారు.