ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలం కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి నూతనంగా నిర్మించబోయే ముఖద్వారానికిమానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ ముఖద్వారానికి నిర్మాణ దాతలు తాండ్ర నిర్మల, శంకర్ బాబు శాలువాతో సన్మానించారు. శ్రీ ఎల్లమ్మ ఆలయానికి ముఖద్వారం ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం శంకర పట్నం రైతు వేదిక పక్కకు నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించే ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యమని ,ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లే అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మల్లారెడ్డి ,ఆలయ కమిటీ చైర్మన్ కోరేం రాజిరెడ్డి , గట్టు తిరుపతి గౌడ్, సదానందం గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.