హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణుకి వినతిపత్రం అందజేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు
చిత్రం న్యూస్, శంకరపట్నం : హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల, కళాశాల బస్సులను తనిఖీలు చేసి ఫిట్ నెస్ లేని బస్సు లను సీజ్ చేయాలని, అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణుకి గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభం మైన నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీలు చేయాలని, అలాగే ప్రతి బస్సుకు ఎడమవైపు, వెనుక స్కూల్ పేరు చిరునామా, ఫోన్ నెంబర్లు ఉండాలని, పాస్టడ్ కిట్ ఉండే విధంగా చూడాలని ఫైర్ సేఫ్టి బస్సు కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో కొన్ని ప్రవేట్ పాఠశాల బస్సులో సామర్ధ్యానికి ఎక్కువగా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారని,అనుమతి లేకుండా ఫిట్ నెస్ లేకుండా తిరుగుతున్నాయని వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బస్సుల పత్రాలను, డ్రైవర్ సామర్థ్యాలను డ్రైవర్ లైసెన్స్ లను పరిశీలించాలని, నిబంధనలు పాటించని ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేనటువంటి ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గణేష్, రాజేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
