Chitram news
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 12:46 pm Editor : Chitram news

ఎస్టీ హాస్టల్ లో  నాణ్యమైన భోజనం అందించాలి

ఎస్టీ హాస్టల్ లో  విద్యార్థులతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్ 

చిత్రం న్యూస్,బోథ్:  విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు రావడం చాలా బాధాకరమని, నాణ్యమైన భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్  అన్నారు. బుధవారం బోథ్ ఎస్టీ హాస్టల్ ను సందర్శించారు.  ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నీళ్ల పప్పు పెట్టడం ,అన్నము సుద్ద సుద్దగా ఉడకడం ఈ విషయాన్ని ఓ విద్యార్థి హాస్టల్ ఇంచార్జిని ప్రశ్నించగా, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారి ఆయనకు టీసీ ఇస్తానని బెదిరించడం శోచనీయమన్నారు.  ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) బోథ్ యూనిట్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యార్థులు తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలన్నది ప్రాథమిక హక్కు. విద్యార్థులను భయపెట్టడం, టీసీ ఇస్తానని బెదిరించడం పూర్తిగా అన్యాయమైనదన్నారు. ఎస్టీ హాస్టల్ లో భోజన నాణ్యతపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విద్యార్థిని బెదిరించిన హాస్టల్ ఇంచార్జ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత  ఉన్నతాధికారులు వారంలోగా చర్యలు తీసుకోకపోతే, AISF ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, హెచ్చరించారు. ఎల్ .నరేష్. శ్రీకాంత్, నితీష్ పాల్గొన్నారు