బోథ్ లో తహసీల్దార్ సుభాష్ చంద్ర కు వినతిపత్రం అందజేస్తున్న నేతలు
చిత్రం న్యూస్, బోథ్: చౌక ధరల దుకాణాలలో ప్రభుత్వం రాయితీపై నిత్యావసర సరకులు ఇవ్వాలని ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ అన్నారు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాలలో బియ్యం మాత్రమే ఇవ్వడంతో నిత్యావసర సరకుల కోసం పేద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. సంపాదనంతా నిత్యావసర సరకులు కొనుగోలు చేయటానికి సరిపోవటంతో పేద ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని, రాయితీపై నూనె, చక్కెర, గోధుమ పిండి, జొన్నలు, పప్పు దినుసులు తదితర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వమే ప్రజలకు పంపిణీ చేయాలని తహసీల్దార్ సుభాష్ చంద్రకు వినతి పత్రం ఆందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్ వెంకటరమణ గౌడ్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు భీమ బుచ్చన్న ,మాజీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భీంరావు, బండారి యానప్ప, బీరం పోశెట్టి, కుమ్మరి భోజన్న తదితరులు పాల్గొన్నారు.