వేదం పాఠశాలలో ఘనంగా జాతీయ వైద్య దినోత్సవం
చిత్రం న్యూస్, బోథ్: వేదం పాఠశాలలో జాతీయ వైద్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ వైద్యులు చేసే సేవల గురించి వివరించారు. పిల్లలు వైద్యుల వేష ధారణ ధరించి వైద్యం అందించే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు డాక్టర్స్ సేవల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. 24 గంటలు వారు సేవలో నిమగ్నం అవుతారని కొనియాడారు . తరువాత విద్యార్థులు బోథ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాణ లకు వెళ్ళి వైద్యులకు పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.