జమ్మికుంట రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే.లక్ష్మీనారాయణ
చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రూరల్ సీఐ గా కే.లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట, వీణవంక మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయికి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రులకు, మరియు గురువులకు, మంచి పేరు తేవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, 100 డయల్ కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవించి వారి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని నిర్భయంగా మీ సమస్యలు మాకు తెలపాలని సీఐ ప్రజలకు సూచించారు.
