Chitram news
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 11:02 am Editor : Chitram news

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ6

చిత్రం న్యూస్, జమ్మికుంట:మండలంలోని ధర్మారం గ్రామంలో రెండో వార్డులో ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం నాయకులు భూమిపూజ  చేశారు .పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఏర్పాటుకు గద్దె నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు  తునికి వసంత్, గ్రామ శాఖ అధ్యక్షులు మారపల్లి సంపత్, వార్డు కౌన్సిలర్ మారేపల్లి బిక్షపతి, నాయకులు మారేపల్లి మల్లయ్య, మారేపల్లి అంజయ్య, మంతిని రామస్వామి,మంతిని అశోక్, మారేపల్లి అజయ్, ఇంజపెల్లి రఘు, మారేపల్లి మొగిలి, సముద్రాల విజయ్ కుమార్, సముద్రాల సంపత్. సముద్రాల క్రాంతి కుమార్, మారపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.