పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే
చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలో డాక్టర్స్ డే ని పురస్కరించుకుని బోథ్ మండల పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ సీ హెచ్ సీ ఆసుపత్రిలో జిల్లా రిమ్స్ ఆస్పత్రి డీ సీ హెచ్ ఎస్ డా.ఉపేందర్ జాధవ్, డా.మితిలేష్ , డా. సుశాంత్, సీ హెచ్ ఎస్ అసిస్టెంట్ సాజిత్ లతో కేక్ కట్ చేయించి శాలివాలతో సత్కరించారు. బోథ్ వట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు మెరుగు బోజన్న మాట్లాడుతూ..డాక్టర్ అంటే మరో పునర్జన్మను ప్రసాదించే దేవుడని,ఆపద, అపాయం సమయంలో మన ఆరోగ్య సమస్యలను దూరం చేసి మన జీవితానికి కొత్త మార్గం చూపే జీవిత సృష్టికర్త ఒక్క డాక్టర్ మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోథ్ పద్మశాలి సంఘం నాయకులు బుస లక్ష్మణ్, వడ్లకొండ సురేందర్, కొమరి దయాకర్,మాసం అనిల్ కుమార్,తడక పోశెట్టి, వడ్లకొండ శ్రీనివాస్, పోశెట్టి, ఆడెపు నరేష్ కుమార్, ఆడెపు కిరణ్, దికొండ రమేష్, నాయకులు గంగాధర్, మెరుగు భోజన్న తదితరులు పాల్గొన్నారు..