పెద్దాపురం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో మంగళవారం వివిధ వార్డుల్లో అభివృద్ది పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ పరిశీలించారు. గత వారం రోజుల గా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది,..రోడ్లు, వార్డు లో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. వర్షాకాలం లో తరచూ అనారోగ్యానికి గురవుతూ, ఆసుపత్రి కి వెళ్లే పరిస్థితులు వస్తాయని , ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకూడదని, డ్రైనేజీ లో చెత్త వేయరాదని , చిన్న పిల్లలు, వృద్ధులను వర్ష కాలం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని వార్డుల్లో ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ వివరించారు.