విద్యార్థికి ఉచితంగా విద్యను అందించడానికి ముందుకొచ్చిన నాగభూషన్ పాఠశాల యాజమాన్యం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎన్నాం నవీన్ ఫొటోగ్రాఫర్ మృతి చెందడంతో ఆయన కుమారుడు రియాన్స్ , విద్యాబ్యాసం కోసం నాగభూషషన్ మెమోరియల్ హైస్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ కిషోర్ గొప్ప మనసుతో విద్యని ఉచితంగా అందించడానికి ముందుకొచ్చారు. నవీన్ కుమారుడికి ఎల్ కె జి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా విద్యని అందించడానికి బాధ్యత వహించారు. నాగభూషన్ మెమోరియల్ హైస్కూల్ కిషోర్ దంపతులను ఘనంగా సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మరకంటి మహేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్, ఆదిలాబాద్ జిల్లా ఫొటోగ్రపీ అధ్యక్షులు దొడ అశోక్, ఉపాధ్యక్షులు ఎం ప్రవీణ్, కోశాధికారి ఎన్. సంతోష్, బోథ్ మండల గౌరవ అధ్యక్షులు జూకంటి సదాశివ్ బోథ్, సొనాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి ముప్కల రాజేశ్వర్ ,కోశాధికారి కే.గణేష్, ఉపాధ్యక్షులు రంజిత్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.