ఉపాధ్యాయుడు మనోజ్ కు ఘన సన్మానం
చిత్రం న్యూస్,బేల: బేల ఉన్నత పాఠశాలలో మరాఠీ సైన్స్ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన మనోజ్ చంద్రసేన్ కు ఆ పాఠశాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.. మండల విద్యాధికారి కోలా నరసింహులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూగ శ్రీనివాస్,జాదవ్ అశోక్, మాజీ సర్పంచ్ మస్కే తేజరావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై ఆయనను ఘనంగా సన్మానించారు.
28 ఏళ్ళ తన సర్వీస్ లో అంకితభావంతో పనిచేస్తూ ఎందరో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది అందరి మన్ననలను పొందారని వక్తలు కొనియాడారు.