పేకాట స్థావరంపై పోలీసుల దాడి
*7 గురు అరెస్ట్, రూ.9,600 నగదు స్వాధీనం
చిత్రం న్యూస్, పెద్దాపురం:కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో మండలంలోని వాలు తిమ్మాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ మౌనిక తన సిబ్బంది తో కలిసి దాడి చేసి, ఏడుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9,600/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.