బంజారా సేవా సంఘం మాచారెడ్డి మండల కమిటీ ఎన్నిక
-మాచారెడ్డి మండల ఉపాధ్యక్షుడిగా భూక్య పుల్ సింగ్ నాయక్
-జాయింట్ సెక్రటరీగా భూక్య రవినాయక్
చిత్రం న్యూస్ జమ్మికుంట:ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు… మాచారెడ్డి మండల ఉపాధ్యక్షుడిగా భూక్య ఫుల్ సింగ్ నాయక్జాయింట్ సెక్రటరీగా భూక్య రవి నాయక్ ఎన్నికయ్యారు. ఎన్నికైన బంజారా నాయకులను ఆదివారం తమ మిత్రబృందం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ బంజారాల హక్కుల కోసం పోరాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్టుతో వీరికి కావలసిన పథకాలను అందించడానికి ప్రయత్నం చేస్తామని బంజారాల కావలసిన వసతులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో బంజారాల అభివృద్ధికి తోడ్పడుదామని ఈ సందర్భంగా తెలిపారు.