ముగిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటన
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది .ఈ సందర్భంగా ప్రజా సేవాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరును పర్యవేక్షించామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భూ బారతి వంటి వాటిని గ్రామ సభల ద్వారా మీ సేవ కేంద్రాల్లో ద్వారా ఫిర్యాదు దారులు అప్లై చేసిన తర్వాత అధికారులు పర్యవేక్షించి కంప్యూటరీకరించాలని అన్నారు. అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ను పర్యాటకంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి,కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కలాల శ్రీనివాస్, బొమ్మ కంటి రమేష్ ,రాంరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.