సారూ..మా సమస్యలు పరిష్కరించండి
*ఎంపీ, ఎమ్మెల్యేకు సాంగిడి గ్రామస్తుల వినతి
చిత్రం న్యూస్, బేల: మండలంలోని సాంగిడి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను గ్రామస్తులు కలిసి విన్నవించారు. ముఖ్యంగా గ్రామంలోని మోతీజీ మహారాజ్ ఆశ్రమంలో షెడ్డు నిర్మాణం చేపట్టాలని, జడ్పీహెచ్ఎస్ స్కూల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సాంగిడి గ్రామంలో నిరుపేదలైన కొన్ని కుటుంబాలకు ఇల్లు రాలేదని, వారందరికీ ఇండ్లు ఇవ్వాలని దృష్టికి తీసుకెళ్ళారు. బెదోడ నుండి సాంగిడికి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. వీరిని కలిసిన వారిలో బీజెపీ నాయకులు కదరపు ప్రవీణ్, మంచాల భూపతిరెడ్డి,నందు గౌడ్ బైర్ వార్, సిద్రాపు ,సుభాష్, ఎల్టి భూమారెడ్డి, మధుకర్ బేదోడ్కార్, నావగరే ప్రభాకర్, తీర్సామృత్కర్ సంజీవ్, గురుదేవ సేవ మండల్ వారు ఉన్నారు.