Chitram news
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 9:08 am Editor : Chitram news

నకిలీ బాబా అరెస్టు

_సీఐ బండారి రాజు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్‌ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ ఫేక్‌ బాబా గుట్టు రట్టైంది. దీంతో.. ఆ నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ బండారి రాజు తెలిపిన వివరాల ప్రకారం. ఇచ్చోడ మండలం కోకస్ మన్నూరు గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అమాయక ప్రజల బలహీతని ఆసరా చేసుకొని వ్యాధులను నయం చేస్తానంటూ తాయత్తులు కట్టి బురిడీ కొట్టించేవాడని అన్నారు. దీంతో నిందితుడిని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.