చిన్నారిపై దాడి అమానుషం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
చిత్రం న్యూస్, నెల్లూరు: నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి చెంచమ్మను సర్వేపల్లి శానసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సెల్ ఫోన్ విషయంలో చిన్నారిపై గరిటె కాల్చి ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టడం దుర్మార్గమన్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చెంచమ్మకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. చెంచమ్మపై అమానుషానికి పాల్పడిన వారిపై కఠిన...