బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి
*విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి *తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి *మనల్ని రక్షించే సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది *ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్ చిత్రం న్యూస్,ఇంకొల్లుః బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో...