Chitram news
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 8:10 am Editor : Chitram news

అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్…

అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్…

*ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డిపై విమర్శలు

చిత్రం న్యూస్, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ.20 లక్షల నిధులతో చేపట్టిన సాగునీటి, త్రాగునీటి పైపులైన్ పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం స్కాంల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో… ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కూడా చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వేసుకున్నావంటూ ఆయన కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులు, వత్తాసు పలికితే క్షేమం. ఇదేనా పాలన అని ప్రశ్నించారు. మహిళ ఫిర్యాదుపై స్పందించకపోవడంపై కేటీఆర్, హరీష్ రావుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ప్రణవ్…కులగణన చేపట్టాం, భూభారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.