Chitram news
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 3:36 pm Editor : Chitram news

ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

*రూ.60వేలు విలువ గల బ్యాగులు, విద్య సామగ్రి విద్యార్థులకు పంపిణీ

*గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరచిన 23 మంది విద్యార్థులకు రూ.23 వేలు నగదు ప్రోత్సాహకం అందజేత

చిత్రం న్యూస్, సాత్నాల: సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో సామాజిక కార్యకర్త ముడుపు  మౌనీష్ రెడ్డి దాతృత్వంతో 145 మంది విద్యార్థులకు రూ 60 వేలు విలువైన బ్యాగులు, వ్రాత కిట్టు, పాఠశాలలో గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులకు 23 వేల నగదును ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు మా వంతు సహాయంగా 145 మంది విద్యార్థులకు 60,000 విలువైన బ్యాగులు, వ్రాత కిట్టు తదితర వస్తువులు అందజేశామన్నారు. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి తరగతిలో ముగ్గురు విద్యార్థుల చొప్పున, 23 మంది విద్యార్థులకు రూ.23వేలు  సహాయం అందజేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. మౌనీష్ రెడ్డిని గ్రామస్తులు సైతం ఘనంగా సన్మానించారు. అంతకుముందు బ్యాండ్ మేళాలతో ఆయనకు విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నైతం దేవుబాయి, రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు గోవర్ధన రెడ్డి, వీరన్న, ఆశన్న యాదవ్, సురేందర్ రెడ్డి, శ్రీకాంత్, అతర్వ, మాజీ సర్పంచ్ పెందూర్ మోహన్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ తానాజీ  తదితరులు పాల్గొన్నారు.