Chitram news
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 12:48 pm Editor : Chitram news

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

*హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించన కాంగ్రెస్ శ్రేణులు.

చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు.రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, సేవాదళ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.