Chitram news
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 5:33 pm Editor : Chitram news

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, పెద్దాపురం:  పెద్దాపురం పట్టణంలోని  శతాబ్ది పార్క్ దగ్గర సబ్ స్టేషన్ లో 33/11kv మరమ్మతులో భాగంగా 20న శుక్రవారం ఉదయం గం.7.00 నుంచి మధ్యాహ్నం గం.1.00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, ఆపరేషన్ A V. N. D. S ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలో పాత పెద్దాపురం,చేపల వీధి, తాడితోట, కుమ్మర వీధి, నాగేశ్వరావు వీధి, పాత బస్ స్టాండ్, మిరపకాయల వీధి, మెయిన్ రోడ్, R B పట్నం రోడ్, శివాలయం వీధి, సినిమా సెంటర్, వ్యాపారపుంత, గౌరికోనేరు, టైలర్స్ కాలనీ, కొత్త పేట, సత్తిరెడ్డి పేట, బంగారమ్మ గుడి వీధి, వీర్రాజు పేట, పరదేశమ్మ కాలనీ, నువ్వులగుంట వీధి, మరిడమ్మా టెంపుల్, గోలి వారి, అంకాయ్యమ్మా పేట, సుబ్బయమ్మ పేట, పాత హాస్పిటల్ వీధి, నవోదయ స్కూల్, రాజీవ్ కాలనీ, వ్యవసాయ బోర్ సర్వీసెస్ కి మరియు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం  ఉంటుందన్నారు.  వినియోగదారులు సహకరించాలని కోరారు.