మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఉత్సవ కమిటీ, అఖిల పక్ష నాయకుల సమావేశం
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవములు జూన్ 24,నుండి జూలై 31వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో విజయలక్ష్మి తెలిపారు. 37 రోజులు జరిగే జాతర మహోత్సవాలకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు కోసం ఈ రోజు బీజెపీ తరుపున ,శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ, అఖిల పార్టీ సమావేశం నిర్వహించారు.పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రాంకుమార్ పాల్గొనారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్దులకు, చంటి బిడ్డలను తీసుకువచ్చే వారికి రద్దీ సమయంలో వారి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలని అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ EO విజయలక్ష్మిని కోరారు.