ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశం విజయవంతం చేయాలి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18న మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలో యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిచరణ్ గౌడ్ తెలిపారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి. శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారన్నారు. కలెక్టర్ చౌక్ లోని వజ్ర బాంకెట్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
-Advertisement-