Chitram news
Newspaper Banner
Date of Publish : 17 June 2025, 4:30 am Editor : Chitram news

త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం

త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం

*18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు

*రూ.3 వేల కోట్లకు పైగా నిధులు సమీకరణ

*మరో హామీ అమలకు సీఎం దూకుడు

చిత్రం న్యూస్, అమరావతి: 

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో  ఆడబిడ్డ నిధి అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది.18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు జమచేయనున్నారు.  దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏడాది బడ్జెట్ లో రూ.3,300 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఆర్థికంగా వెనుక బడిన మహిళలకు మరో రూ.630 కోట్లు, మైనార్టీ మహిళలకోసం రూ.84 కోట్లు, ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నారు.