Chitram news
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 1:35 am Editor : Chitram news

డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

*ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

*ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ

*మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి

చిత్రం న్యూస్,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి కోరారు.