ప్రసాద్ ల్యాబ్ లో “ప్రేమిస్తున్న” చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి
*హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు సుబ్బు
చిత్రం న్యూస్, ఫిలింనగర్: ఐబీఎం ప్రొడక్షన్ హౌస్ అధినేత దుర్గారావు పప్పుల నిర్మాతగా, భాను దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ప్రేమిస్తున్న. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో బుధవారం పూర్తి చేసుకుంది. తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు సుబ్బు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా “ప్రేమిస్తున్న“ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నారు. ప్రేమిస్తున్న చిత్రంలో ఓ కూతురికి తండ్రిలాగా బాధ్యత గల పాత్రను పోషిస్తున్నట్లు తమిళ నటుడు సుబ్బు తెలియజేశారు. దర్శకుడు భాను చెప్పిన కథ విధానం నచ్చి ఈ చిత్రంలో నటించినట్లు ఆయన తెలిపారు. అవకాశం వస్తే తెలుగు సినిమాలలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్బు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు భాను శంకర్, నిర్మాత కనక దుర్గారావు పప్పుల, నిర్వాహకులు.M. రవికుమార్, నటులు శ్రీనివాస్, దర్శక విభాగం, P. ప్రదీప్. శ్రీకాంత్, గణేష్, మేనేజర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.