విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం పట్టణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి చదువు కోసం రూ.8 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దాపురం పట్టణ వాసి, వెలమ కుటుంబానికి చెందిన చీపురుపల్లి రాజు కుమారుడు తేజ ఎడ్యుకేషన్ కోసం పాలిటెక్నిక్ ఒక సంవత్సరం ఫీజు కొరకు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్ద్యార్థి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆపన్న హస్తం అందించారు. మంగళ వారం ఉదయం విద్యార్థి చీపురుపల్లి తేజ వీర వెంకట సాయి s/o చీపురుపల్లి రాజు పాలిటెక్నిక్ సంవత్సరం “పీజు కోసం” పెద్దాపురం పట్టణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పప్పల బుజ్జి ప్రధాన కార్యదర్శి యాళ్ళ వీరబాబు, కోశాధికారి అల్లు ప్రసాద్ చేతుల మీదుగా రూ.8 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి బాబురావు, వెలగల వెంకటరమణ, తైనాల శ్రీను, సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ.. బాగా చదువుకునే విద్యార్ధులు కొరకు సంఘంలో ఉన్న అందరి సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగు పడాలని ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.. ఎవరయినా చదువుకునే విద్యార్ధులు సహాయం కోసం తమని సంప్రదించవచ్చు అన్నారు.