Chitram news
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 11:33 am Editor : Chitram news

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

*కుటుంబసభ్యులు, అభిమానుల నడుమ ప్రత్యేక పూజలు

*బాధ్యతల స్వీకరణ

చిత్రం న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు గారిని నియమించడంతో శుక్రవారం ఉదయం 7.55 నిమిషాలకు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు తోడురాగా అప్కాబ్ సిబ్బంది సమక్షంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు అభిమానులూ, అధికారుల నడుమ గన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సంధర్భంగా అప్కాబ్ సిబ్బంది ఎం.డి.ఎస్ఆర్.రెడ్డి, సిజిఎం, డిజిఎం,ఎజిఎం లతో పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అభివృద్ధికి తోడ్పడదాం.. మనందరం కలిసికట్టుగా పనిచేసి అప్కాబ్ అభివృద్దికి తోడ్పడదామని అన్నారు. ముందుగా అప్కాబ్ ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  పదవీ భాద్యతల అనంతరం సెంట్రల్ మానిటరింగ్ యూనిట్(సి సి కెమేరా యూనిట్)ను ప్రారంభించారు. అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం సంధర్భంగా ఆవరణలో మొక్క నాటారు.