Chitram news
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 7:44 am Editor : Chitram news

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

*ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

చిత్రం న్యూస్, వినుకొండ:  గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఆయనతో విన్నవించుకున్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.