Chitram news
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 8:26 am Editor : Chitram news

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం

చిత్రం న్యూస్, పెద్దాపురం:

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం అనేది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది మాత్రమే కాకుండా, సామాజిక, భావోద్వేగ, ఆరోగ్య, మరియు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరినీ పర్యావరణ సమస్యలపై స్పృహతో కూడిన చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది .తల్లితో ఉన్న భావోద్వేగ బంధాన్ని గౌరవించే ఒక అద్భుతమైన మార్గం. పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామకుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బిక్కినవిశ్వేశ్వరరావు, సభ్యత్వ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథులుగా పాల్గొనారు. పార్టీ ఆవిర్భావ సభ్యులు దుర్గా మోహన్ రావు ,సామర్లకోట ప్రధాన కార్యదర్శి జూని మోసెస్ , దేవాడ శ్రీను, కాకి భార్గవి, డి విజయలక్ష్మి, పడాల వీరభద్రరావు, ఓడిమని శివ, కోన రాంబాబు, తోటకూర సత్యనారాయణ, ఉప్పల నాగేశ్వరావు, నెల్లిపూడి బ్రహ్మేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.