Chitram news
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 4:24 pm Editor : Chitram news

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

*హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబుని అభినందించిన గ్రామస్తులు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

కాంగ్రెస్ యువనేత, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణయ్ బాబు తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చారు. సొంత ఖర్చులను వెచ్చించి శ్మశానవాటిక నిర్మాణానికి  స్వీకారం చుట్టారు.  గ్రామంలో చాలా కాలంగా శ్మశానవాటిక లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణయ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా గ్రామస్తులు వినతిపత్రం అందించగా స్పందించిన ప్రణయ్ బాబు స్థానిక పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఆలస్యం చేయకుండా  శ్మశానవాటిక నిర్మాణానికి సొంత ఖర్చుతో పనులు శ్రీకారం చుట్టారు. ప్రణయ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు,  ప్రణయ్ బాబు మాట ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించడం గౌరవంగా అనిపిస్తుందని, ఇలాంటి నాయకుడు మాకు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ  ప్రశంసలు కురిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణయ్ బాబు చేసిన  కృషికి స్థానికుల నుంచి మంచి ఆదరణ పొందాడు.