Chitram news
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 11:40 am Editor : Chitram news

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 


కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

  • *ఎంపీ సానా సతీష్ బాబు

చిత్రం న్యూస్, కాకినాడ:  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీ, బీజేపీ జిల్లా నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే వర్మలు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. వెన్నుపోటు పేరుతో జగన్ రెడ్డి పార్టీ నిరసన చేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసారు. వచ్చే నాలుగేళ్లలో కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎంపీ సానా సతీష్ బాబు వెల్లడించారు.