ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలను మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.