Chitram news
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 4:28 pm Editor : Chitram news

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

*ఖరీఫ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి

*మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు

చిత్రం న్యూస్, చిగురుమామిడి:
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. నకిలీ విత్తనాలను గుర్తించడానికి మండల వ్యాప్తంగా అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మండల వ్యాప్తంగా 24,600 ఎకరాలు వరి, మొక్కజొన్న 400 ఎకరాలు, 1500 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నట్లు తెలిపారు.యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు విత్తనం రకం, కంపెనీ, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. రైతులకు ఎలాంటి  సందేహాలు ఉన్న తమను సంప్రదించాలని సూచించారు.