Chitram news
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 11:09 am Editor : Chitram news

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు

*ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం

చిత్రం న్యూస్, వాడపల్లి:
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశంలో చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య ఉన్నందు వల్ల ఆయా ప్రాంతాల నుండి వచ్చేవారికి తగు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశించారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రం వద్ద భోజనం చేస్తున్న భక్తులను భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు.  దర్శన ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.అనతరం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని,ఎవరైనా సమస్యలు చెప్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ పంజా భాస్కరకృష్ణ రావు అనే భక్తుడు స్వామి వారికి 50 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు.