జూన్ లో ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తున్న ‘
*దర్శకుడు భాను తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం
*సాత్విక్ వర్మ, ప్రీతి హీరో హీరోయిన్లుగా
చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్:
ఐ బి ఎం ప్రొడక్షన్ హౌస్ లో దర్శకుడు భాను దర్శకత్వంలో యంగ్ హీరో సాత్విక్ వర్మ, నూతన హీరోయిన్ ప్రీతి నటించగా ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమకు నిర్వచనం తెలుపుతూ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్న’. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ జూన్ నెలాఖరులో విడుదలకు సిద్ధం అవుతుంది.
గతంలో అర్ధనారి. రాజధాని ఫైల్స్. రాజు మహారాజు. ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు భాను తన పంథాను మార్చుకొని మొట్టమొదటిసారిగా ఓ ప్రేమ కథ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సందేశాత్మకంగా తీసిన చిత్రాలు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. అర్ధనారి చిత్రానికి మూడు నంది అవార్డులు రాగా ప్రత్యేక రాజధాని కోసం రాజధాని ఫైల్స్ లాంటి సినిమా తీసి ప్రేక్షకుల మెప్పుపొందగలిగాం. ఎన్నో రోజుల నుండి తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి ప్రేమ కథ చిత్రం అందించాలనే ఉద్దేశంతో ఈ ‘ప్రేమిస్తున్న’ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు భాను తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు మించి రాబోతున్న ఈ చిత్రానికి నిర్మాత కనకదుర్గారావు పప్పుల. చిత్ర నిర్వహణ మర్రి రవికుమార్, డిఓపి భాస్కర్,సంగీతం సాలూరి సిద్దు, మాటల రచయిత అనిల్, ఫైట్స్ నందు, కొరియోగ్రఫీ స్వర్ణ మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్ భూపతి యాదగిరి, ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మణ్, పీ ఆర్ ఓ శ్రీధర్, మేకప్ బాబు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈశ్వర్, పల్లె ప్రదీప్, నాగరాజు, శ్రీకాంత్, గణేలు ఉన్నారు. జూన్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.