మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలుపు
చిత్రం న్యూస్ పెద్దాపురం:
పెద్దాపురం మండలంలోని పెద్దాపురం లో కొలువై ఉన్న మరిడమ్మ అమ్మవారి ఆలయంలో తాత్కాలికంగా అన్న ప్రసాద వితరణ నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు. జూన్ 24వ తారీకు నుంచి మరిడమ్మ అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. ఆ సమయంలో అన్న ప్రసాద వితరణను తాత్కాలికంగా నిలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. జాతర అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆమె తెలిపారు.